ఆ భూములు వారికే... వైసీపీ ఎమ్మెల్యే సవాల్

కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్లు అన్ని రంగాల్లో ముందున్నారని... రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్లు కూడా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

news18-telugu
Updated: January 3, 2020, 11:35 AM IST
ఆ భూములు వారికే... వైసీపీ ఎమ్మెల్యే సవాల్
ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
  • Share this:
రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నట్లు నిరూపిస్తే... అవి వారికే రాసిచ్చేస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నారని వైసీపీ ఆరోపించగా... వైసీపీ నేతలకు కూడా అమరావతిలో భూములు ఉన్నారని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా అమరావతిలో భూములు ఉన్నాయని ఆరోపించింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే... ఈ ఆరోపణలపై స్పందించారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు నీరుకొండలో ఐదెకరాలు ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్లు అన్ని రంగాల్లో ముందున్నారని... రాయలసీమ, ఉత్తరాంధ్ర వాళ్లు కూడా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని గురించి మాట్లాడడానికి చంద్రబాబు, లోకేష్‌కు సిగ్గుండాలని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కొత్త బినామీ పవన్‌కళ్యాణ్‌ అని మండిపడ్డారు. అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి చంద్రబాబు దగ్గర పవన్‌ ప్యాకేజీ తీసుకున్నాడని దుయ్యబట్టారు. మంగళగిరిలో జనసేన ఎందుకు పోటీకి పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు దోపిడిని సపోర్ట్‌ చేసేందుకు పవన్‌ అమరావతిలో తిరుగుతున్నాడని ఆళ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.
First published: January 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు