టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా మరోసారి ఓటుకునోటు కేసు తెరపైకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు గడప తొక్కారు. తన పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరుతూ ఆయన ‘ఎర్లీ హియరింగ్’ పిటిషన్ వేశారు. 2017లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేసినా.. అది సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాలేదు. దీంతో మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం ట్రయల్ కోర్టులో కేవలం ఏ1 నుంచి ఏ5 వరకు మాత్రమే విచారణజరుపుతున్నారని, చంద్రబాబు మీద విచారణ జరపడం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. చంద్రబాబు మీద కూడా విచారణ జరిపించాలని, ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరారు.
సుప్రీంకోర్టుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ బేరం చేసింది. ఈ డీల్‌ను అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేశారు. స్టీఫెన్‌సన్‌తో మొత్తం రూ.5కోట్ల డీల్ ఓకే చేసి.. అందులో రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చిన వీడియో సాక్ష్యం సంచలనం సృష్టించింది. ఈ డీల్ సందర్భంగా చంద్రబాబునాయుడు, స్టీఫెన్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ.. టీడీపీ అధినేతను ఇరుకున పెట్టేసింది. మనవాళ్లు బ్రీఫ్డీ మీ అంటూ చంద్రబాబు చెప్పిన ఆడియో దుమారం రేపింది. అయితే, తన ఫోన్‌ను టాప్ చేశారంటూ చంద్రబాబునాయుడు కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.