చంద్రబాబు అలా అనొచ్చా... మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దెందులూరు లో రివ్యూ మీటింగ్ పెట్టాలని... చింతమనేని బాధితులను మీ దగ్గరకు పంపిస్తామని అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: November 18, 2019, 10:31 PM IST
చంద్రబాబు అలా అనొచ్చా... మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే
చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబుపై దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. చింతమనేని ప్రభాకర్‌ తనకు స్ఫూర్తి అని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. చింతమనేని లాంటి రౌడీషీటర్‌ స్ఫూర్తి అని చెప్పడం ద్వారా ఈ సమాజానికి ఏ సందేశాన్ని ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్‌ ఇసుక,మట్టి అమ్ముకుని లోకేష్‌కు ముడుపులు పంపారు కాబట్టే మీకు స్ఫూర్తిగా నిలిచారా అని అబ్బయ్య చౌదరి ధ్వజమెత్తారు. చట్టం తన పని తాను చేయటం వల్లనే... ఏపీలో ప్రశాంత వాతావరణం ఉందని అన్నారు.

చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దెందులూరు లో రివ్యూ మీటింగ్ పెట్టాలని... చింతమనేని బాధితులను మీ దగ్గరకు పంపిస్తామని అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామంటూ బెదిరిస్తే బెదిరేది లేదని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు.


First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...