టీడీపీని ఇరికించే విషయంలో వైసీపీకి కొత్త అస్త్రం ?

నిమ్మగడ్డ పేరుతో ఆ లేఖపై సంతకం చేసింది ఎవరు? లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారన్న వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలితే కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బైటకు వస్తాయని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: April 16, 2020, 3:49 PM IST
టీడీపీని ఇరికించే విషయంలో వైసీపీకి కొత్త అస్త్రం ?
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ ఏపీలో రాజకీయ పార్టీల ఎత్తుగడలు కొనసాగుతున్నాయి. తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు వ్యూహాత్మకంగా చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం... తాజాగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై గతంలో కేంద్రం హోంశాఖకు రాసిన లేఖపై ఫోకస్ పెట్టింది. నిమ్మగడ్డ పేరుతో ఆ లేఖపై సంతకం చేసింది ఎవరు? లేఖను ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోం శాఖ అధికారికి మెయిల్ చేశారు? ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారన్న వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలితే కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బైటకు వస్తాయని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ అంశంపై దర్యాప్తు చేయాలని ఆయన ఏపీ డీజీపీకి లేఖ రాశారు.

అయితే నిన్న ఈ లేఖపై వివరణ ఇచ్చిన రమేశ్ కుమార్... తానే స్వయంగా ఈ లేఖను రాసినట్టు ప్రకటన విడుదల చేశారు. రమేశ్ కుమార్ ఈ లేఖపై వివరణ ఇచ్చినప్పటికీ... దీనిపై విచారణ చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ లేఖ ఏ ఐపీ అడ్రస్ నుంచి కేంద్ర హోంశాఖకు వెళ్లిందనే దానిపై దర్యాప్తు చేస్తే... ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ హస్తం ఉందనే విషయం వెలుగులోకి వస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే తన లేఖపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివరణ ఇచ్చినప్పటికీ... ఈ అంశంపై దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటోంది. మొత్తానికి టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు వైసీపీకి సరికొత్త అస్త్రం లభించినట్టే కనిపిస్తోంది.

First published: April 16, 2020, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading