సొంత పార్టీ ఎంపీపై చర్యలకు సిద్ధమవుతున్న వైసీపీ ?

వైసీపీ పాలన గురించి ఆ పార్టీ నేతలంతా గొప్పగా చెబుతుంటే... రఘురామకృష్ణంరాజు మాత్రం సొంత పార్టీ పాలన పనితీరుపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: June 16, 2020, 7:04 AM IST
సొంత పార్టీ ఎంపీపై చర్యలకు సిద్ధమవుతున్న వైసీపీ ?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan)
  • Share this:
పదే పదే తన వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందిపెడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపైచర్యలు తీసుకునేందుకు వైసీపీ అధినాయకత్వం సిద్ధమవుతోందా ? నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు రెడీ అవుతోందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ పాలన గురించి ఆ పార్టీ నేతలంతా గొప్పగా చెబుతుంటే... రఘురామకృష్ణంరాజు మాత్రం సొంత పార్టీ పాలన పనితీరుపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే... ఆయన బాటలోనే మరికొందరు నేతలు పయనిస్తారని పలువురు వైసీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై పార్టీపరంగా చర్యలు తీసుకునేందుకు వైసీపీ అధినాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చి... దానికి వచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలనే భావనలో పార్టీ నేతలు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతకుముందు సొంత పార్టీ ప్రభుత్వం తీరుపై రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న ఇళ్ల పథకంలో స్థలాల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొనుగోళ్లలోనూ గోల్‌మాల్‌ జరుగుతోందని... ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా భూములను కొని పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంటే కొందరు కమీషన్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తిరుమల భూముల వేలం, ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు తరలింపు వంటి అంశాలపై తాను మీడియాతో మాట్లాడానని.. తన వ్యాఖ్యలపై కొందరు నొచ్చుకున్నారని అన్నారు. తనకు సీఎం జగన్ సమయం అడిగినా లభించకపోవడంతోనే ఇవన్నీ బయట చెప్పాల్సి వచ్చిందని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
First published: June 16, 2020, 7:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading