వైసీపీ ఎంపీ బాలశౌరికి ఢిల్లీలో కీలక పదవి...

బాలశౌరి (File)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఢిల్లీలో కీలక పదవి దక్కింది.

  • Share this:
    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఢిల్లీలో కీలక పదవి దక్కింది. పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన వాటిలో ఒకటైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా బాలశౌరి నియామితులయ్యారు. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నియామకం జరిగింది. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి పీఏసీ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. ఆ కమిటీలో బాలశౌరి సభ్యుడిగా ఉంటారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ప్రకటించింది. పీఏసీ అంటే ప్రభుత్వం చేసే ఖర్చులను పరిశీలించే కమిటీ. సహజంగా ప్రతిపక్షానికి చెందిన నేతకు ఈ పదవి రావడం ఆనవాయితీగా ఉంటుంది. పార్లమెంట్‌లో ప్రతిపక్షానికి చెందిన నేతను చైర్ పర్సన్‌గా నియమించి, ఆ కమిటీలో ఇతర పార్టీలకు చెందిన వారిని కూడా సభ్యులుగా నియమిస్తారు. పార్లమెంట్‌లో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగా నియామకం ఉంటుంది. లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తర్వాత వైసీపీకే ఎక్కువ మంది ఎంపీలు (22) ఉన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: