‘ఇస్మార్ట్ నాని’ అంటూ టీడీపీ ఎంపీపై పీవీపీ సెటైర్లు

చంద్రబాబు వెంటనే హెరిటేజ్ పాలు పంపిస్తే, బారులు తీరిన అప్పుల వాళ్లకు ఓ కప్పు కాఫీ ఇస్తామని ఎద్దేవా చేశారు పీవీపీ.

news18-telugu
Updated: August 4, 2019, 11:32 AM IST
‘ఇస్మార్ట్ నాని’ అంటూ టీడీపీ ఎంపీపై పీవీపీ సెటైర్లు
కేశినేని నాని,పీవీపీ
  • Share this:
ఈ మధ్య రాజకీయ నేతలు... ట్రెండ్‌ను బాగానే ఫాలోఅవుతున్నారు. ట్రెండింగ్‌లో ఏం నడుస్తుందో దాన్నే ఫాలో అయి విమర్శలు చేస్తున్నారు. బాహుబలి సినిమా సమయంలో కూడా... కట్టప్ప, బాహుబలి, భల్లాలదేవ అంటూ క్యారెక్టర్లతో అధికార, విపక్షాలు విమర్శలు గుప్పించుగున్నారు. ఇప్పుడు పూరి విడుదల చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను కూడా వాడేస్తున్నారు. తాజాగా వైసీపీ నేత పీవీపీ .. టీడీపీ నేతలపై ఇస్మార్ట్ ప్రయోగం చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నానిని ‘ఇస్మార్ నాని’ అంటూ కామెంట్ చేశాడు.

టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)  ఘాటు విమర్శలు చేశారు. అమెరికాలో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు రోడ్ల మీద పాప్ కార్న్ తింటూ కులాసాగా తిరుగుతుంటే, ఆయన సహచరుడు ఇస్మార్ట్ నాని (కేశినేని నాని) మాత్రం వ్యాపారాలు మూసేసి అందరినీ రోడ్డున పడేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని బెజవాడను దివాళా తీయించాడని పీవీపీ మండిపడ్డారు. చంద్రబాబు వెంటనే హెరిటేజ్ పాలు పంపిస్తే, బారులు తీరిన అప్పుల వాళ్లకు ఓ కప్పు కాఫీ ఇస్తామని ఎద్దేవా చేశారు. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి కేశినేని కార్గో వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటూ కెనరా బ్యాంకు జారీచేసిన స్వాధీన ప్రకటనను పీవీపీ జత చేశారు.

First published: August 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు