మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను తప్పుబట్టిన వైసీపీ ముఖ్యనేత

మంత్రి కొడాలి నాని విపక్షాల ట్రాప్‌లో పడ్డారని వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: September 24, 2020, 4:38 PM IST
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను తప్పుబట్టిన వైసీపీ ముఖ్యనేత
కొడాలి నాని(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. వ్యక్తిగత వ్యాఖ్యలు ఎవరిపై ఎవరు చేసినా సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేసి విపక్షాల ట్రాప్‌లో పడొద్దని ఆయన సూచించారు. మంత్రి కొడాలి నాని విపక్షాల ట్రాప్‌లో పడ్డారని అభిప్రాయపడ్డారు. జగన్‌ను టార్గెట్ చేసుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ భక్తి శ్రద్ధలతో తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని వివరించారు. విపక్షాలు ప్రజా సమస్యలపై ధర్నా చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.

Cm ys jagan mohan reddy one year rule, sajjala Ramakrishna reddy, ap news, ap politics, ysrcp, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన, సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
సజ్జల రామకృష్ణారెడ్డి(ఫైల్ ఫోటో)


తిరుమలలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని తీరు వైసీపీకి ఇరకాటంగా మారినట్టు కనిపిస్తోంది. కొడాలి నాని చేసిన ఇతర వ్యాఖ్యలపై అంతగా చర్చ జరగకపోయినప్పటికీ.. ఆయన ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దుమారం రేపాయి. కొడాలి నాని అహంకారంతో మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అహంకారంతో దేవుళ్లను, అత్యంత పవిత్ర హిందువులయిన ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి దూషించిన కొడాలి నాని కలియుగ శిశుపాలుడు అని మండిపడ్డారు. వంద సార్లు మోదీని దూషించే దాకా ఆగి నారా చంద్రబాబు లాగా తమ పతనాన్ని కోరి తెచుకుంటారో లేక వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి సీఎం జగన్ తమ తప్పును గుర్తిస్తారో చూడాల్సి వుందని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు.

Bjp mp gvl narasimha rao comments, gvl narasimha rao tdp, gvl narasimha rao slams ysrcp, ap news, ap politics, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కామెంట్స్, జీవీఎల్ నరసింహారావు, టీడీపీ, వైసీపీ
జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)


కొడాలి నాని జగన్ మత్తులో వున్నారని, మెప్పుపొందేందుకు కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌లపై మంత్రి కొడాలి నాని అనుచితంగా మాట్లాడటం దారుణమని అన్నారు. కొడాలి నాని వేరొక మతం పై ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుంటే సీఎం జగన్ ఊరుకునేవారా అని ఆయన ప్రశ్నించారు. కొడాలి నానిపై సీఎం జగన్ చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఉద్యమిస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

Kodali nani news, tdp news, ap news, ap politics, kodali nani in Tirumala, తిరుమలలో కొడాలి నాని, టీడీపీ న్యూస్, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, తిరుమలలో కొడాలి నాని
ఏపీ మంత్రి కొడాలి నాని(ఫైల్ ఫోటో)


మంత్రి కొడాలి నాని అంటే వైసీపీ తరపున టీడీపీని విమర్శించే నేతగా గుర్తింపు ఉంది. చంద్రబాబును, నారా లోకేశ్‌ తీవ్రంగా విమర్శించే వారిలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. అయితే అలాంటి కొడాలి నాని ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆగ్రహం కలిగిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు కొడాలి నానిపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి బీజేపీ కూడా తోడైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తప్పించాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్న టీడీపీకి, ఆయన ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం కలిసొచ్చినట్టయ్యింది. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మంత్రి కొడాలి నాని టీడీపీతో పాటు బీజేపీకి కూడా టార్గెట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: September 24, 2020, 4:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading