జగన్ పాలన అలా ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డి

తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 90 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు.

news18-telugu
Updated: May 30, 2020, 2:29 PM IST
జగన్ పాలన అలా ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ర్టాన్ని అన్ని రంగాలలో ముందంజ వేసేలా చేయడానికి సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏదో ఒకటి,రెండు అంశాలలో కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని అభివృధ్ది దిశగా, వేగంగా తీసుకువెళ్లడానికి అవసరమైన సమగ్రమైన మౌళికమార్పులు చేస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉండటమే అదృష్టంగా భావితరాలు భావించేలా సీఎం జగన్ పని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారంనాడు వేడుకలు ఘనంగా జరిగాయి. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండా ఎగరేసి దివంగత సీఎం వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

పదేళ్లుగా రాజన్న వారసుడిగా,వైయస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న నాయకుడిగా ప్రజలు అభిమానించారన్న విషయం జగన్‌కు తెలుసన్న సజ్జల... మేనిఫెస్టోలో పెట్టిన 90 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ రంగంలో ఉండే విద్యా,వైద్యవ్యవస్ధకు దీటుగా ప్రభుత్వరంగంలోని విద్య, వైద్య రంగాలను తీర్చి దిద్దుతున్నారని వివరించారు. ఏడాదిపాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమనికి పెద్ద పీట వేశారు.కరోనా వైరస్ నియంత్రణకు శ్రీ వైయస్ జగన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని సజ్జల తెలియచేశారు.

First published: May 30, 2020, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading