ఆట మొదలయ్యాక అనుమానాలేంటి? చంద్రబాబుపై వైసీపీ నేత ఘాటు వ్యాఖ్యలు

ఈవిఎం హ్యాకర్‌ను సలహాదారుగా పెట్టుకున్న చంద్రబాబు.. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్నారని విమర్శించారు. వివి ప్యాట్‌లలో ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుస్తుందన్నారు.

news18-telugu
Updated: April 23, 2019, 3:19 PM IST
ఆట మొదలయ్యాక అనుమానాలేంటి? చంద్రబాబుపై వైసీపీ నేత ఘాటు వ్యాఖ్యలు
చంద్రబాబు (File)
news18-telugu
Updated: April 23, 2019, 3:19 PM IST
పోలింగ్ తర్వాత నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు వీలు దొరికినప్పుడల్లా ఏపీ సీఎంను దంచేస్తున్నారు. తాజాగా వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ముందు రోజు నుంచి చంద్రబాబు పథకం ప్రకారం పాలనలో తప్పు లేదు..కానీ ఈవిఎం లపై తప్పు నెడుతూ వస్తున్నారని విమర్శించారు.
ఈవిఎం హ్యాకర్‌ను సలహాదారుగా పెట్టుకున్న చంద్రబాబు.. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్నారు. వివి ప్యాట్‌లలో ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుస్తుందన్నారు. ఆట మొదలయ్యాక అనుమానం వ్యక్తం చేయడం ఏంటి ? అంటూ చంద్రబాబును సజ్జల ప్రశ్నించారు. టీడీపీ తమ్ముళ్లకు నచ్చజెప్పుకోవడానికి ఈవిఎంలపై తప్పు నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.

ఎన్నికల తర్వాత హుందాగా ఉండాలి అంటూ సీఎంకు హితవు పలికారు సజ్జల. ఇన్నాళ్లు

ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఆటలు ఇక సాగవన్నారు. జేసీ దివాకర్ రెడ్డి నిరాశ, నిస్పృహలతో ఉన్నారని ఆరోపణలు చేశారు సజ్జల. చంద్రబాబు హుందాతనం లేకుండా నియంత లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాల పరిమితి అయిపోయిన తర్వాత సమీక్షలు చేయడం ఏంటి ? అంటూ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా నోటీసులు వచ్చాయన్నారు. అనవసరంగా టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...