ప్రధాని మోదీకి జైకొట్టిన వైసీపీ నేత... ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

పీవీపీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగిన క్రమంలోనే.. ఆయన ప్రధాని మోదీని కీర్తిస్తూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రఘురామ కృష్ణంరాజు తరహాలోనే పీవీపి కూడా బీజేపీకి దగ్గరవుతున్నారా? అని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: July 7, 2020, 2:44 PM IST
ప్రధాని మోదీకి జైకొట్టిన వైసీపీ నేత... ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్
పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)
  • Share this:
ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కొన్ని రోజులుగా చర్చనీయాంశమైంది. స్వపక్షంలోనే విపక్షంగా తయారయ్యారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందున ఆయనపై వేటు వేయాలని.. ఇప్పటికే వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిపి లేఖ సమర్పించారు. ఆయన స్టోరీని మరవకముందే ఇప్పుడు మరో వైసీపీ నేత వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేత, సినీ నిర్మాత ప్రధాని మోదీపై ప్రశంసలుకు కురిపించారు. చైనాపై డిజిటల్ స్ట్రైక్ చేసి, దౌత్యం ద్వారా సరిహద్దు నుంచి వెనక్కినెట్టారని ట్విటర్‌లో కొనియాడారు.

శాంతి సందేశం పంపిస్తున్న చైనా..! హిందీ, చీని భాయి భాయి అని నెహ్రు గారిలా మోసపోకుండా, డిజిటల్ స్ట్రైక్ మరియు దౌత్యం ద్వారా వెనక్కి నెట్టిన నరేంద్ర మోదీ గారికి దేశమంతా జేజేలు.
పీవీపీ

పీవీపీ కోసం ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో పీవీపీపై కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేశారని, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పీవీపీపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. తన ఇంటికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులపై పెంపుడు కుక్కులను వదిలారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన పీవీపీ.. ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఇప్పుడు ట్వీట్ చేశారు.

2019 ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైసీీప తరపున పీవీపీ పోటీ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేత కేశినేని నానిపై ఆయన ఓటమి పాలయ్యారు. పీవీపీని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగిన క్రమంలోనే.. ఆయన ప్రధాని మోదీని కీర్తిస్తూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రఘురామ కృష్ణంరాజు తరహాలోనే పీవీపి కూడా బీజేపీకి దగ్గరవుతున్నారా? అని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Published by: Shiva Kumar Addula
First published: July 7, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading