ఐరన్‌లెగ్ ముద్రపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు.. మంత్రి పదవిపైనా..

AP Cabinet: తనకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని.. మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదని రోజా తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 7, 2019, 11:12 AM IST
ఐరన్‌లెగ్ ముద్రపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు.. మంత్రి పదవిపైనా..
జగన్‌తో రోజా సెల్ఫీ(ఫైల్ ఫోటో)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 7, 2019, 11:12 AM IST
ఐరన్‌లెగ్ ముద్ర రావడంపై వైసీపీ ఫైర్‌ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఐరన్‌లెగ్ కాదని, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనపై అలా దుష్ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు. ఇక, మంత్రి పదవి అవకాశాలపైనా రోజా స్పందించారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని.. మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదని రోజా తెలిపారు. పార్టీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో జగన్‌కు తెలుసని ఆమె తెలిపారు. కాగా, జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభాపక్ష భేటీ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సరిగ్గా పది గంటలకు వైసీపీఎల్పీ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో కేబినెట్‌ కూర్పు, ప్రజాకర్షక పథకాలు, పరిపాలనపై చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ తన కేబినెట్‌లోకి మొదట 25 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీసీ, ఎస్టీ, ఎస్సీలకు 50 శాతం వరకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఎస్సీ,  ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు విడివిడిగా డిప్యూటీ సీఎం పదవులు ఇస్తున్నారని తెలిసింది. అలాగే... రెండున్నర ఏళ్ల తర్వాత కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారని సమాచారం.

First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...