బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదు..వైసీపీ నేత తీవ్ర విమర్శలు

బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదని గతంలోనే డాక్టర్లు చెప్పారని.. ఇప్పుడు కూడా ఆయన తీరుపై అనుమానముందని ఆయన అన్నారు. బాలకృష్ణ మానసిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని కోరుముట్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: June 5, 2020, 3:39 PM IST
బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదు..వైసీపీ నేత తీవ్ర విమర్శలు
అందులో ఒకటి అఘోరా పాత్ర కూడా. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఒకటి ఉంది. అది బాలయ్య చేయడం లేదు కానీ మరో యంగ్ హీరోకి ఇచ్చేసాడు. అతడే నవీన్ చంద్ర.
  • Share this:
సినీ నటడుు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నేత, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా.. వైసీపీ ప్రభుత్వంపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదని గతంలోనే డాక్టర్లు చెప్పారని.. ఇప్పుడు కూడా ఆయన తీరుపై అనుమానముందని ఆయన అన్నారు. బాలకృష్ణ మానసిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని కోరుముట్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే పదవికి బాలకృష్ణ అనర్హుడని విమర్శించారు. ఆయన తీరుతో హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును బాలకృష్ణ తన భుజాలపై మోస్తున్నారని విమర్శించారు శ్రీనివాస్. ఏడాది కాలంలోనే సీఎంగా జగన్ మంచి పేరు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఏడాదిలోనే ఇన్ని మంచి పనులు చేస్తే.. రాబోయే కాలంలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో టీడీపీ నేతలు గ్రహించాలని ఆయన అన్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 5, 2020, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading