వైసీపీని వీడేందుకు దగ్గుబాటి నిర్ణయం..? రెండు మూడు రోజుల్లో రాజీనామా..?

వైసీపీ నుంచి తప్పుకున్న తర్వాత.. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనే ఆలోచనలో దగ్గుబాటి ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 26, 2019, 9:25 PM IST
వైసీపీని వీడేందుకు దగ్గుబాటి నిర్ణయం..? రెండు మూడు రోజుల్లో రాజీనామా..?
దగ్గుబాటి వెంకటేశ్వరరావు(File)
  • Share this:
వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. భార్యాభర్తలు చెరో పార్టీలో కొనసాగడం పార్టీకి ఇబ్బందికరమని వైసీపీ అధిష్టానం దగ్గుబాటితో చెప్పినట్టు తెలుస్తోంది.పురంధేశ్వరిని కూడా వైసీపీలోకి తీసుకురావాలని వెంకటేశ్వరరావును సీఎం జగన్ కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వైసీపీ అధిష్టానం నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో పార్టీని వీడాలని దగ్గుబాటి నిర్ణయించుకున్నట్టు సమాచారం.
మరో రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వైసీపీ నుంచి తప్పుకున్న తర్వాత.. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనే ఆలోచనలో దగ్గుబాటి ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన దగ్గుబాటి.. పర్చూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. వాస్తవానికి కుమారుడు దగ్గుబాటి హితేశ్ రాజకీయ భవిష్యత్‌ కోసమే ఆయన పార్టీలో చేరారు. పర్చూరు నుంచి తొలుత హితేశ్‌నే పోటీ చేయించాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల చివరకు వెంకటేశ్వరరావే పోటీ చేసి ఓడిపోయారు.

First published: October 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>