Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    డేటాచోరీ కేసులో ఈసీ జోక్యం చేసుకోవాలి: వైసీపీ నేత సి. రామచంద్రయ్య

    డేటా చోరీ అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో కేసు నమోదు కావడంతో తెలంగాణ పోలీసులు ఈ వ్యవహరంలోకి ఎంటరయ్యారు. తాజాగా, ఈ అంశంపై స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

    news18-telugu
    Updated: March 4, 2019, 7:32 PM IST
    డేటాచోరీ కేసులో ఈసీ జోక్యం చేసుకోవాలి:  వైసీపీ నేత సి. రామచంద్రయ్య
    చంద్రబాబు, సి. రామచంద్రయ్య ఫైల్
    • Share this:
    డేటా చోరీ అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా..  దీనికి సంబంధించి హైదరాబాద్‌లో కేసు నమోదు కావడంతో తెలంగాణ పోలీసులు ఈ వ్యవహరంలోకి ఎంటరయ్యారు. తాజాగా, ఈ అంశంపై స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుపై  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సమాచారాన్ని స్వయంగా ప్రభుత్వమే.. ప్రైవేటు సంస్థలకు తెలియజేయడం దారుణమన్నారు. ఇది చాలా పెద్ద నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ హస్తం ఉందని ఆరోపించారు. కుట్రపూరితంగానే గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ఐటీ సంస్థలకు దారాదత్తం చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన పెద్ద గ్రహణమని రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. ప్రజల సమాచారాన్ని కూడా కొల్లగొట్టి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని ధ్వజమెత్తారు. తండ్రీ కొడుకులిద్దరే ఈ పెద్ద క్రైమ్‌కు కారణమయ్యారని ఆరోపించారు. డేటా చోరీకి సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. దీనిపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

     
    First published: March 4, 2019, 7:27 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading