ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి... వైసీపీ నేత డిమాండ్

ఏపీలో పరిస్థితులు దిగజారుతున్నాయని ఆరోపించిన వైసీపీ నేత రామచంద్రయ్య... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు చంద్రబాబు రికార్డులను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.

news18-telugu
Updated: April 17, 2019, 12:12 PM IST
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి... వైసీపీ నేత డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 17, 2019, 12:12 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయినా... రాజకీయ వాతావరణం మాత్రం ఇంకా హాట్ హాట్‌గానే కొనసాగుతోంది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తుంటే... ఆయన తీరును తప్పుబడుతూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు పూర్తయిన తరువాత కొందరు నేతలపై కేసులు నమోదు కావడం... పోలీసు అధికారులపై విపక్షాలు విమర్శలు చేస్తుండటంతో ఫలితాల వరకు ఈ రాజకీయ వేడి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే ఏపీలో పరిస్థితులు దిగజారుతున్నాయని ఆరోపించిన వైసీపీ నేత రామచంద్రయ్య... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు చంద్రబాబు రికార్డులను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయని... వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన రామచంద్రయ్య... పరిస్థితులు అదుపులో ఉండాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరారు. ఇప్పటికప్పుడు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేకపోయినప్పటికీ... శాంతి భద్రతల విషయంలో సమస్యలు తలెత్తితే పరిస్థితి అంతవరకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...