టీడీపీ ఎమ్మెల్యేలకూ సమాన నిధులు... వైసీపీ నేత

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ ఎమ్మెల్యేలకు రూ.కోటి చొప్పున నిధులు ఇస్తున్నారని వైసీపీ నేత బొప్పన భవకుమార్ అన్నారు.

news18-telugu
Updated: November 17, 2019, 3:27 PM IST
టీడీపీ ఎమ్మెల్యేలకూ సమాన నిధులు... వైసీపీ నేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ ఎమ్మెల్యేలకు రూ.కోటి చొప్పున నిధులు ఇస్తున్నారని వైసీపీ నేత బొప్పన భవకుమార్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్‌ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా స్వాగతిస్తామన్నారు. దేవినేని అవినాష్‌ పార్టీలోకి రావటాన్ని ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చడం వల్లే ఇతర పార్టీకి చెందిన పలువురు నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని ఆయన అన్నారు. విహారయాత్రకు అమెరికా వెళ్లి వచ్చిన గద్దె రామ్మెహన్‌ తనపై విమర్శలు చేయడం ఏంటని భవకుమార్ వ్యాఖ్యానించారు.

నాలుగు వేల మంది పేదలకు ఇల్లు, ఇళ్లస్థలాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.






First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com