ముఖ్యమంత్రిగా జగన్... అమరావతిలో వెలిసిన బ్యానర్లు

ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలవకముందే ఆ పార్టీకి చెందిన ఓ నేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: May 22, 2019, 4:14 PM IST
ముఖ్యమంత్రిగా జగన్... అమరావతిలో వెలిసిన బ్యానర్లు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 22, 2019, 4:14 PM IST
ఏపీలో అధికారం దక్కించుకోబోయేది ఎవరనే విషయం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. రేపు ఉదయం మొదలుకానున్న ఓట్ల లెక్కింపులో ఎవరిది పైచేయి అనే విషయం తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే తమ విజయంపై ధీమాతో ఉన్న రాజకీయపార్టీలు గెలుపు తమదంటే తమదంటూ ఇప్పటికీ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీడీపీతో పోలిస్తే విపక్ష వైసీపీ నేతలు కాస్త ఎక్కువగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అడుగు ముందుకేసిన ఓ వైసీపీ నేత... ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.

ys jagan,ys jagan mohan reddy,jagan mohan reddy,ap cm,ys jagan mohan reddy ap next cm 2019,ap politics,ap cm jagan mohan reddy,ys jagan mohan reddy attack,ycp chief ys jagan mohan reddy,ys jagan mohan reddy whatsapp survey,parrot about ys jagan mohan reddy,ys jagan to become ap cm,ys jagan will be next cm of ap - mohan babu - tv9,how ys jagan to become ap cm,Amaravati,tadepalli ys jagan house,tdp,chandrababu naidu,ap politics,ap latest news,ap election results,ఏపీ రాజకీయాలు,ఏపీ ఎన్నికలు 2019,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైసీపీ,టీడీపీ,అమరావతి,చంద్రబాబునాయుడు
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం అంటూ వెలసిన బ్యానర్


ఓట్ల లెక్కింపు సందర్భంగా అమరావతిలోని తాడేపల్లి సమీపంలోని తన నివాసానికి చేరుకోనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ అమరావతి వచ్చారని తెలుసుకున్న వైసీపీ నేతలు... ఒక్కొక్కరికి తాడేపల్లికి క్యూ కడుతున్నారు. దీంతో తాడేపల్లిలోని జగన్ కొత్త ఇల్లు పరిసరాలు వైసీపీ బ్యానర్లతో నిండిపోయాయి. ఈ క్రమంలోనే పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన దొరబాబు అనే వైసీపీ నేత ఏకంగా జగన్ ముఖ్యమంత్రి అయిపోయినట్టు బ్యానర్లు ఏర్పాటు చేయడం ఆసక్తిరేపుతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అని అందులో ఉంది. వైసీపీ గెలవకముందే ఆ పార్టీ నేత ఈ రకమైన బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...