ప్రజారాజ్యం బాటలోనే జనసేన.. వైసీపీ జోస్యం

ప్రత్యేక హోదాపై బీజేపీని నిలదీయాల్సింది పోయి.. ఆ పార్టీతోనే చేతులు కలుపుతారా అంటూ విమర్శించారు రాంబాబు. గతంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న పవన్‌కు.. ఇప్పుడు కొత్త లడ్డూలేమైనా ఇచ్చారా? అని సెటైర్లు వేశారు.


Updated: January 16, 2020, 5:33 PM IST
ప్రజారాజ్యం బాటలోనే జనసేన.. వైసీపీ జోస్యం
పవన్ కల్యాణ్,అంబటి రాంబాబు (File Photos)
  • Share this:
ఏపీలో జనసేన-బీజేపీ పొత్తుపై వైసీపీ స్పందించింది. ఏ ఎన్నికలు లేని సమయంలో పొత్తు పెట్టుకోవడమంటే..ప్రజల దృష్టిని మరల్చడమేనని అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వ లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మీరు కలవడం తప్పులేదని.. ఐతే ఆ క్రమంలో తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. పవన్ ఏ పార్టీతోనూ కుదురుగా ఉండరని.. అలాగే ఈ పొత్తుపైనా గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. ప్రజారాజ్యం బాటలోనే జనసేన కూడా కాలగర్భంలో కలిసిపోతుందని జోస్యం చెప్పారు.

రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కల్యాణ్. సుందరయ్య విజ్ఞాన భవన్‌లో కూర్చుంటే కమ్యూనిస్టు సిద్దాంతం ప్రజలకు మంచిదని అంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పుస్తకాలు చదువుతుంటే చంద్రబాబంత గొప్పవాడు లేరని అదంటారు. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ లైబ్రరీలో ఉంటే మోదీ గొప్ప వ్యక్తి అని అంటారు. రేపు ఎక్కడ కూర్చుంటారో.. ఏ పుస్తకం చదువుతారో.. ఏ పార్టీలో చేరతారో స్పష్టత లేదు. అలాంటి వ్యక్తితో బీజేపీ కలిస్తే మాకు అభ్యంతరం లేదు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదుతుంటే మాకెందుకు అభ్యంతరం? 2014లో టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేశారు. 2019లో వామపక్షాలు, బీఎస్పీతో కలసి పోటీ చేశారు. టీడీపీతో లాలూచీ ఒప్పందం చేసుకొని పోటీ చేశారు. ఇప్పుడు నాలుగున్నరేళ్లు ఒక పార్టీతో ఆయన ఉండగలరా? ఈ పొత్తుకైనా గ్యారంటీ ఉందా..?
అంబటి రాంబాబు


ప్రత్యేక హోదాపై బీజేపీని నిలదీయాల్సింది పోయి.. ఆ పార్టీతోనే చేతులు కలుపుతారా అంటూ విమర్శించారు రాంబాబు. గతంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న పవన్‌కు.. ఇప్పుడు కొత్త లడ్డూలేమైనా ఇచ్చారా? అని సెటైర్లు వేశారు. బీజేపీలో బేషరతుగా కలవాల్సిన అవసరమేంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కులతత్వం, కుటుంబ పాలన, అవినీతి అంటూ 7 మాసాల తమ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారని.. కేవలం 7 నెలల్లోనే ప్రభుత్వ పనితీరును నిర్ణయిస్తారా? అని విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>