జూన్ 8 వరకు నేనే సీఎం... చంద్రబాబు ఓటమి ఒప్పుకున్నారు... వైసీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

పోలింగ్ పూర్తి అయినప్పటి నుంచి చంద్రబాబు మాట తీరులో మార్పు వచ్చిందని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: May 17, 2019, 2:23 PM IST
జూన్ 8 వరకు నేనే సీఎం... చంద్రబాబు ఓటమి ఒప్పుకున్నారు... వైసీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
అంబటి రాంబాబు
news18-telugu
Updated: May 17, 2019, 2:23 PM IST
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరును వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుబట్టారు. జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రి అని చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత కూడా తానే సీఎం అని చెప్పలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఓడిపోబోతున్నట్లు చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఇలాంటి మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయని అంబటి రాంబాబు అన్నారు. పోలింగ్ పూర్తి అయినప్పటి నుంచి చంద్రబాబు మాట తీరులో మార్పు వచ్చిందని ఆయన తెలిపారు. చంద్రగిరిలో ఈసీ రీపోలింగ్‌కు ఆదేశించడాన్ని చంద్రబాబు తప్పుబట్టడం సరికాదని అంబటి అన్నారు.

తమ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన తరువాతే రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీనిపై చంద్రబాబు, టీడీపీ నానా హడావుడి చేస్తోందని అంబటి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాటలు వింటుంటే... అసలు ఎన్నికలే అప్రజాస్వామ్యం
అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రీపోలింగ్ వల్ల ఏదో గందరగోళం జరుగుతుందని టీడీపీ చచ్చు ఆరోపణలు చేస్తోందని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అసలు చంద్రబాబుకు దేనిపైన విశ్వాసం ఉందో ఆయన చెప్పాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏవిధమైన ఫలితాలు వచ్చినా హుందాగా స్వీకరించాలని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...