జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు ‘ఇంటెలిజెన్స్’.. వైసీపీ నేత ఆరోపణలు

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చంద్రబాబునాయుడి ‘ఇంటెలిజెన్స్’ పనిచేస్తోందని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఆరోపించారు.

news18-telugu
Updated: August 2, 2019, 8:47 PM IST
జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు ‘ఇంటెలిజెన్స్’.. వైసీపీ నేత ఆరోపణలు
ఆమంచి కృష్ణమోహన్ (File)
  • Share this:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడి ఇంటెలిజెన్స్ నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ ఆరోపించారు. రాష్ట్రం మొత్తంలో వారు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్‌కు చెడ్డపేరు తెచ్చేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లెటర్ హెడ్ కలర్ జిరాక్స్ తీసి దాంతో రిఫరెన్స్ లేఖలు ఇవ్వడం వెనుక స్పెషల్ బ్రాంచ్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఈ మేరకు ఫిర్యాదు చేశారు. త్వరలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా రానున్న స్టీఫెన్ రవీంద్రను కలసి పిర్యాదు చేస్తామని తెలిపారు. చీరాలలో టీడీపీ నేతలే వైసీపీ వారిపై దాడులు చేస్తూ.. తమపై దాడి జరిగినట్లు పోలీసులకు పిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఒంగోలు ఎస్బీ డీఎస్పీగా పనిచేస్తున్న రాంబాబు.. మంత్రి బాలినేని లెటర్ హెడ్ లు మార్చి ఆ నింద ప్రభుత్వం పై వేయడానికి ప్రయత్నం చేసారని ఆమంచి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కూడా టీడీపీ కి అనుకూలంగా వ్యవహరించారని.. ఆయన వెళ్లి పోయినా ఇప్పటికీ ఒంగోలు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రాంబాబు కూడా అదేవిధంగా... ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...