వైసీపీలో ముసలం.. ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేల రహస్య భేటీ.. రాజీనామా బాటలో...

మూడు రాజధానులపై కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తం అయినట్టు తెలుస్తోంది. వారు ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: August 1, 2020, 4:30 PM IST
వైసీపీలో ముసలం.. ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేల రహస్య భేటీ.. రాజీనామా బాటలో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో అధికార వైసీపీలో మూడు రాజధానుల ముసలం పుట్టింది. మూడు రాజధానులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో అధికార వైసీపీలో జోష్ వచ్చింది. అయితే, అదే పార్టీకి చెందిన కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తం అయినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు అమరావతే రాజధాని గా ఉంటుందని ప్రకటించి ఇప్పుడు రాజధానిని తరలించడం పై కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. రాజధాని తరలింపు అనేది తమ రాజకీయ జీవితానికి మరణశాసనం అని వైసీపీ శాసనసభ్యులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల తమకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లాలో 15 మంది శాససభ్యులు, కృష్ణా జిల్లా లో 14 మంది శాససభ్యులు పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. విజయవాడలోని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తకి చెందిన ఒక హోటల్ లో రహస్య మంతనాలు చేసినట్టు చెబుతున్నారు. త్వరలోనే స్పీకర్ ఫార్మాట్ లో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు రాజీనామా లేఖలు పంపనున్నట్టు తెలిసింది. తమతో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడా వారు సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. వారు కూడా రాజీనామాకు అంగీకరించినట్టు సమాచారం.

మరోవైపు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 1, 2020, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading