వైసీఎల్పీలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం

అసెంబ్లీకి హాజరుకాకుండా కాపు రిజర్వేషన్‌లపై అత్యవసరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 29, 2019, 12:08 PM IST
వైసీఎల్పీలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
బొత్స సత్యనారాయణ (File)
  • Share this:
వైసీఎల్పీలో కాపు మంత్రులు,ఎమ్యెల్యే ల సమావేశం.. అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు బొత్స, అవంతి,ఆళ్ల నాని,ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు,పలువురు కాపు ఎమ్యెల్యే లు.. హాజరయ్యారు. EWS రిజర్వేషన్ లపై ప్రభుత్వం ఇచ్చిన జీవో పై చర్చించారు. గత ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ లు అమలు కాకపోవడంపై ఈ భేటీలో నాయకులు చర్చించినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీకి హాజరుకాకుండా కాపు రిజర్వేషన్ లపై అత్యవసరంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయినట్లు తెలుస్తోంది.

EWS రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవోపై అధికార, ప్రతిపక్షాలలో తీవ్ర చర్చ.. నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన తాజా జీవో ద్వారా కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు వర్తించనట్లే. తాజాగా అంతర్గత చర్చ తర్వాత సీఎం జగన్‌తో వైసీపీ కాపు నాయకులు భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు EWS రిజర్వేషన్ లపై ఇచ్చిన జీవోపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. 10 శాతంలో అగ్రవర్ణాలకు కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉందని టీడీపీ చెబుతోంది. కాపు సమాజం స్పందనను బట్టి ముందుకెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకోంది.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు