వైసీపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష... లాక్ డౌన్ ముగిశాక..

కాకినాడ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

advertorial
Updated: May 1, 2020, 2:46 PM IST
వైసీపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష... లాక్ డౌన్ ముగిశాక..
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తీరుకు నిరసనగా తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత తాను నిరాహార దీక్ష చేస్తానని ద్వారంపూడి ప్రకటించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన కొండబాబు అనవసరంగా కేసులు వేస్తూ వాటికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ద్వారంపూడి ఆరోపించారు. తన నిరాహార దీక్ష ద్వారా కొండబాబు వైఖరిని ఎండగడతానన్నారు. కొండబాబు రాజకీయ జీవితం అంతా భూ కబ్జాలు, అవినీతిమయం అయిపోయిందని ఆరోపించారు. కొండబాబుకి వ్యతిరేకంగా తాను సాక్ష్యాలు సిద్ధం చేస్తున్నానని త్వరలో వాటిని బయటపెడతానని ద్వారంపూడి చెప్పారు. ప్రభుత్వం పేదలకు ఇవ్వాలనుకుంటున్న భూములు ఏ శాఖకు కూడా చెందినవి కావని అధికారులు స్పష్టం చేసినట్టు ద్వారంపూడి తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాలు అందివ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 1, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading