టీడీపీకి ఆయుధాన్ని ఇచ్చిన వైసీపీ... తమ్ముళ్ల దూకుడు...

చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వద్ద రూ.2.63లక్షల నగదు మాత్రమే దొరికినట్టు ఐటీ శాఖ పంచనామా తెలపడంతో వైసీపీ డిఫెన్స్‌లో పడింది.

news18-telugu
Updated: February 16, 2020, 7:39 PM IST
టీడీపీకి ఆయుధాన్ని ఇచ్చిన వైసీపీ... తమ్ముళ్ల దూకుడు...
సీఎం జగన్, చంద్రబాబునాయుడు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో డిఫెన్స్‌లో పడిపోయింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వద్ద పీఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ అనే ఉద్యోగిపై ఐటీ దాడుల్లో సుమారు రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులు దొరికాయంటూ వైసీపీ భారీ ఎత్తున ప్రచారం చేసింది. ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఓ ప్రకటనలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించినట్టు పేర్కొంది. ‘2020 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణెల్లో సోదాలు జరిపింది. మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. అధిక బిల్లులు, బోగస్ బిల్లులతో బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిపిన రాకెట్ గుట్టు రట్టయింది. ఓ ప్రముఖుడికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. ఆ పర్సన్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభ్యమయ్యాయి.’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఆదాయపన్ను శాఖ జారీ చేసిన పత్రికా ప్రకటన


అయితే, అందులో ఎక్కడా పెండ్యాల శ్రీనివాస్ వద్ద రూ.2వేల కోట్ల అక్రమాస్తులు లభించాయనే అంశాన్ని స్పష్టం చేయలేదు. కానీ, తాజాగా ఆదాయపన్ను శాఖ మరో ప్రకటన చేసింది. పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో జరిపిన సోదాల్లో రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఐటీశాఖ స్పష్టం చేసింది. దీంతో శ్రీనివాస్ ఇంట్లో రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐటీ పంచనామా నివేదిక తేల్చింది. అంతేకాదు సోదాల అనంతరం పంచానామా నివేదికపై శ్రీనివాస్‌, ఐటీ అధికారుల సంతకాలు చేసినట్లు నివేదికలో ఉంది.

చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే రూ.2వేల కోట్లు దొరికాయంటే చంద్రబాబు, లోకేష్ వద్ద ఇంకెంత ఉంటుందో అంటూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్‌లో విరుచుకుపడ్డారు. వారి మీద కూడా ఐటీ దాడులు జరపాలని డిమాండ్ చేశారు.అయితే, పెండ్యాల శ్రీనివాస్ వద్ద దొరికింది కేవలం రూ.2.5లక్షలే నని తెలియడంతో ఇప్పుడు టీడీపీ నేతల్లో జోష్ పెరిగిపోయింది. వైసీపీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఐటీ దాడులపై వైసీపీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసినందుకు టీడీపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దుష్ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు, లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కరీంనగర్‌లో ఘోరం.. వంతెనపై నుంచి పడిపోతున్న కానిస్టేబుల్

First published: February 16, 2020, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading