అమరావతికి జగన్... మళ్లీ సీఎంగానే హైదరాబాద్‌కు... వైసీపీ వర్గాల్లో చర్చ

బుధవారం హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీ ముఖ్యమంత్రిగానే మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

news18-telugu
Updated: May 22, 2019, 6:16 PM IST
అమరావతికి జగన్... మళ్లీ సీఎంగానే హైదరాబాద్‌కు... వైసీపీ వర్గాల్లో చర్చ
ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
news18-telugu
Updated: May 22, 2019, 6:16 PM IST
గురువారం జరగబోయే ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి అత్యంత కీలకం. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అనేక ఇబ్బందులు పడిన ఆ పార్టీ... ఈ సారి కచ్చితంగా గెలుపు తమదే అనే ధీమాలో ఉంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు జరగడానికి ఒక రోజు ముందు అమరావతికి ప్రయాణమైన జగన్ మోహన్ రెడ్డికి... ఈ పర్యటన ప్రత్యేకంగా మారనుంది. ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చి ఆ పార్టీ విజయం సాధిస్తే... ఇక వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం లాంఛనమే అవుతుంది.

ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీ ముఖ్యమంత్రిగానే మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ విజయం సాధిస్తే... ఆ తరువాత ఇడుపులపాయ వెళ్లడానికి జగన్ నిర్ణయించారు. అక్కడే జగన్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్షం నేతగా ఎన్నుకుంటారని సమాచారం. అనంతరం ఆ లేఖను గవర్నర్‌కు అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వైసీపీ నేతలు కోరతారని తెలుస్తోంది. అలా అమరావతిలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మళ్లీ హైదరాబాద్ వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి... వైసీపీ నేతలు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...