Home /News /politics /

కేంద్రంపై వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ ఎటాక్.. ఇక మోదీతో జగన్ యుద్ధమేనా?

కేంద్రంపై వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ ఎటాక్.. ఇక మోదీతో జగన్ యుద్ధమేనా?

మోదీని కలిసిన జగన్ (File)

మోదీని కలిసిన జగన్ (File)

పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ పై జగన్ ప్రభుత్వ ఏర్పాటు ముందు నుంచే సంకేతాలు ఇస్తున్నారు. అయినా అప్పుడు మాట్లాడని కేంద్రం... కాంట్రాక్టు రద్దుకు నోటీసులు ఇచ్చిన సమయంలో స్పందించడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఏపీలో ఏదోరకంగా పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి జగన్ నిర్ణయాలు వరంగా మారుతున్నాయా ? కేంద్రం ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, తాజాగా పోలవరం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతోందా ? అవుననే అంటున్నారు రాష్ట్ర మంత్రి పేర్ని నాని. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వారికి కంటగింపుగా మారాయని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఏపీలో టీడీపీ ఓటమితో ఏర్పడిన రాజకీయ శూన్యతను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ... జగన్ ప్రభుత్వాన్ని కావాలనే ఇరుకున పెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ వైఖరిపై నోరు మెదపని వైసీపీ నేతలు ఇవాళ గొంతు విప్పారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, నిన్న లోక్ సభలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పట్టేలా ఉన్నాయని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని ఆరోపించారు. బాధ్యతాయుత పదవిలో ఉంటూ, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యలు కక్షసాధింపు ధోరణిలో ఉన్నాయని నాని ఆరోపించారు.

    పేర్నినాని వ్యాఖ్యల వెనుక మరో కారణం కూడా ఉంది. రెండు రోజులుగా రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవహారాలపై కేంద్రం స్పందించడం, దాన్ని వాడుకుంటూ విపక్ష టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుండటంతో నాని సీరియస్ అయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ పై జగన్ ప్రభుత్వ ఏర్పాటు ముందు నుంచే సంకేతాలు ఇస్తున్నారు. అయినా అప్పుడు మాట్లాడని కేంద్రం... కాంట్రాక్టు రద్దుకు నోటీసులు ఇచ్చిన సమయంలో స్పందించడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యల వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని భావిస్తున్న వైసీపీ... ఆదిలోనే వీటికి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తాము అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే కేంద్రం కావాలనే కక్షసాధింపుకు దిగుతోందని పేర్నినాని విమర్శలకు దిగారు.

    ఇప్పటికే వైసీపీ ప్రభుత్వాన్ని రోజూ ఏదో ఒక అంశంపై కవ్విస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు మంత్రి పేర్నినాని వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ పేర్నినాని ఆరోపణలను బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకుంటే మాత్రం భవిష్యత్ రాజకీయాలకు ఇక్కడే బీజం పడినట్లవుతుంది. అప్పుడు వైసీపీపై బీజేపీ మరింత సీరియస్ గా దాడిని తీవ్రతరం చేసే అవకాశముంది.

    (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bjp, Pm modi, Polavaram, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు