ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా తీర్మానం... చంద్రబాబు వల్లే రాలేదన్న సీఎం జగన్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అసెంబ్లీలో తీర్మానం చేశారు సీఎం జగన్. గత ప్రభుత్వం తీరు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని టీడీపీ తీరును తప్పుబట్టారు.

news18-telugu
Updated: June 18, 2019, 2:10 PM IST
ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా తీర్మానం... చంద్రబాబు వల్లే రాలేదన్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
news18-telugu
Updated: June 18, 2019, 2:10 PM IST
గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. గత చంద్రబాబు సర్కారు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్లే హోదా వెనక్కి వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్టేట్‌మెంట్ చదవి వినిపించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనంతరం వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జగన్ హోదా తీర్మానం చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వద్దు.. హోదానే కావాలని తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు. ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రానికి అధిక గ్రాంట్లు వస్తాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

59% శాతం జనాభాను, అప్పులను వారసత్వంగా పొందామని.. అంతేకాకుండా విభజనలో మౌళిక సదుపాయాలు అతి తక్కువగా వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన విషయాన్ని సభలో సీఎం ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా ఆదాయాన్ని, ఉద్యోగాన్ని ఇచ్చే హైదరాబాద్ కూడా ఏపీకి లేకుండా పోయిందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేని, ఆ అన్యాయాలు మరింతగా పెరగటానికి కారణమయ్యిందని జగన్ విమర్శించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.


First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...