AP Parishat Elections Results: పరిషత్ ఎన్నికల్లో ఫ్యాన్ దూకుడు.., టీడీపీ, జనసేన స్కోర్ ఇదే..!

వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరోసారి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) మరోసారి ప్రభంజనం సృష్టించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో (ZPTC, MPTC Elections) సునాయాసంగా విజయం సాధించింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) మరోసారి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  (YSR Congress Party) మరోసారి ప్రభంజనం సృష్టించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో  (ZPTC, MPTC Elections)సునాయాసంగా విజయం సాధించింది. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్తులను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎంపీటీసీల్లోనూ 90శాతం స్థానాలు దక్కించుకుంది. రాష్ట్రంలో మొత్తం 515 జడ్పీటీసీ, 7,219 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీకి 502 జెడ్పీటీసీ, దాదాపు 6వేల ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)నేతలు సొంతగా బరిలో దిగడంతో ఆరు జెడ్పీటీసీ, 800 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. మూడోస్థానంలో నిలిచిన జనసేన పార్టీ (Janasena Party) 164 ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంది.

    పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ భారీ ఆధిక్యం సాధించింది. రాష్ట్రంలో ఉన్న 660 జడ్పీటీసీ స్థానాలకు గానూ ఎన్నికల ముందే 126 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. నామినేషన్ వేసిన అభ్యర్థులు చనిపోవడం, ఇతర కారణాలతో 19చోట్ల ఎన్నికల జరగలేదు. దీంతో మిగిలిన 515 చోట్ల ఎన్నికలు నిర్వహించగా.. వైసీపీ 13 జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ కేవలం ఆరు మండలాలనే దక్కించుకుందంటే వైసీపీ హవా ఎలా సాగిందో అర్దమవుతుంది.

    ఇది చదవండి: చంద్రబాబు కంచుకోటకు బీటలు... కుప్పంలో జెండాపాతిన వైసీపీ...


    విశాఖ జిల్లా (Visakhapatnam)నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా (East Godavari) వీఆర్ పురం, పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) ఆచంట, కృష్ణాజిల్లా (Krishna District) మోపిదేవి, కడప జిల్లా (Kadapa District)గోపవరం, అనంతపురం జిల్లా (Anantapuram District) అగళి జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జనసేన సొంతమైంది. విశాఖపట్నం ఏజెన్సీలోని అనంతగిరి జెడ్పీటీసీని సీపీఎం దక్కించుకుంది.

    ఇది చదవండి: వైన్ షాపులో చల్లని బీరు కావాలి.. ఓటుతో పాటు మందుబాబుల లెటర్ వైరల్...


    ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే.. 10,047 స్థానాలకు గానూ 2,371 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 81 చోట్ల అభ్యర్థులు చనిపోవడం, 376 చోట్ల ఇతర కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. ఏప్రిల్ 8న 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 6వేలకు పైగా స్థానాలు వైసీపీ సొంతమయ్యాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో టీడీపీ కాస్త ప్రభావం చూపింది. ఇక గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ మంచి ఫలితాలనే దక్కించుకుంది. జనసేన విజయం సాధించిన 164 ఎంపీటీసీ స్థానాల్లో 140 ఈ రెండు జిల్లాల్లోనే దక్కించుకుంది.

    ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. అధికార వైసీపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలనే మరోసారి రిపీట్ చేసింది. కుప్పంలోని నాలుగు జెడ్పీటీసీలను వైసీపీ కైవసం చేసుకుంది. కుప్పం పరిధిలోని 19 ఎంపీటీసీ స్థానాలకుగానూ 17 వైసీపీ కైవసం చేసుకోగా.., 2 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. రామకుప్పం మండలంలో 16 ఎంపిటిసి స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా... గుడిపాల మండలంలో 13 స్థానాల్లో 12 వైసీపీ, ఇతరులు ఒక్క స్థానంలో గెలుపొందారు. ఇక శాంతిపురం మండలంలో 18 స్థానాల్లో వైసీపీ 17 కైవసం చేసుకోగా... టీడీపీ ఒక్క స్థానంలో నిలిచింది. ఇక చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారి పల్లె ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు.
    Published by:Purna Chandra
    First published: