• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • YSRCP GOING TO BE LEADER IN ANDHRA PRADESH LEGISLATIVE COUNCIL AS TDP MEMBERS TENURE COMPLETED FULL DETAILS HERE PRN GNT

Andhra Pradesh: పొలిటికల్ సీన్ రివర్స్.. సీఎం జగన్ నిర్ణయంపై సస్పెన్స్..

ప్రతీకాత్మకచిత్రం

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే.. బలం లేదనుకున్న చోట బలపడటం.., కంచుకోటలు బద్దలవడం పాలిటిక్స్ లో కామన్.

  • Share this:
    Anna Raghu, Guntur Correspondent, News18

    రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే.. బలం లేదనుకున్న చోట బలపడటం.., కంచుకోటలు బద్దలవడం పాలిటిక్స్ లో కామన్. అలాంటి సీనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటు చేసుకుంటోంది. నిన్నటి వరకూ మండలిలో ఆధిక్యం కొనసాగించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వెనుకబడిపోయింది. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెలమ్యేలతో తిరుగులేని మెజారిటీ కలిగినప్పటికీ.. మండలిలో మాత్రం మైనారిటీ కావడంతో కీలక బిల్లులను ఆమోదించుకోలేక నానా అవస్థలు పడుతూవచ్చింది. దీంతో ఏకంగా మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. ఆ తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదం కోసం పంపించడమే కాకుండా కేంద్ర పెద్దలను కూడా కలిసి మండలి రద్దుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు శాసనమండలిలో సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీతో పాటు మండలిలోనూ వైసీపీ లీడింగ్ లోకి రానుంది. శుక్రవారం మండలిలో ఏకంగా ఏడుగురు సభ్యులు రిటైర్ అవ్వడంతో ఇప్పుడు అవన్నీ వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఏడింటిలో వైకాపా సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీటు మినహా మిగిలిన ఆరు సీట్లూ టీడీపీకి చెందినవి కావడం గమనార్హం. ఇప్పుడు ఈ సీట్లన్ని అధికార పార్టీ ఖాతాలోనే పడడం లాంఛనమే.

    ఇప్పటికే గవర్నర్ కోటాలో నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలోకి చేరాయి. దీంతో మండలిలో ఆపార్టీ బలం 22 సీట్లకు చేరుకుంది. అదే సమయంలో టీడీపీ బలం 21 నుండి 15కు పడిపోయింది. సమీప భవిష్యత్తులో మండలిలో ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయో అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనడంలో సందేహమే లేదు. దీంతో మండలిలో సంపూర్ణ ఆధిఖ్యం సంపాదించింది. ఇప్పుడు ఖాళీ అయిన 7 సీట్లు, కోర్టుల్లో పెండింగ్ ఉన్న స్థానిక సంస్థల కోటాలోని మరో నాలుగు సీట్లు కలిపి మొత్తం 11కి 11 స్థానాలు వైసీపీ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

    ఇది చదవండి: ఏపీలో కర్ఫ్యూ సడలింపులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ


    సమీప భవిష్యత్తులో అటు టీడీపీకి చెందిన మండలిస్థానాలు ఖాళీ అవడమే తప్ప.. ఆ పార్టీ నుంచి భర్తే అయ్యే అవకాశాలు దాదాపు లేవు. మరోవైపు అధికార వైసీపీకి కూడా రోజురోజుకీ బలం పెరుగుతుండటంతో శాసనమండలిలోనూ తిరుగుండదు. మరోవైపు రాజధాని బిల్లలు తిరస్కరణ నేపథ్యంలో మండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపింది. రాజధాని బిల్లులను ఆమోదింపజేసుకొని పాలనా వికేంద్రీకరణ విషయంలో ముందుకెళ్లాలంటే అధికార పార్టీకి మండలి అవసరం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో మండలి రద్దు ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటారా..? లేక కొనసాగిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

    ఇది చదవండి: ఏపీలో గంజాయి మాఫియా వెనుక పోలీస్ హస్తం..? అసలు నిజం ఇదేనా..?

    Published by:Purna Chandra
    First published: