బహిష్కరించిన నేతకు కీలక పదవిచ్చిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన కె.శివకుమార్‌ను ఓ దశలో పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. ఆ తర్వాత తెలంగాణ జనరల్ సెక్రటరీగా నియమించారు.

news18-telugu
Updated: September 18, 2019, 3:24 PM IST
బహిష్కరించిన నేతకు కీలక పదవిచ్చిన జగన్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
news18-telugu
Updated: September 18, 2019, 3:24 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి అవకాశం కల్పించింది. ఈ 28 మందిలో 8 మంది ఏపీకిచెందిన వారు ఉన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురికి అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురికి టీటీడీ పాలకమండలిలో స్ధానం కల్పించారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచీ ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. అయితే, వారిలో గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత కూడా ఉండడం గమనార్హం. తెలంగాణ నుంచి పాలకమండలిలో చోటు దక్కించుకున్న కె.శివకుమార్ గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురవడం గమనించాల్సిన అంశం.

కె. శివకుమార్, వైఎస్ జగన్


2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కె.శివకుమార్ సంచలనాన్ని సృష్టించారు. కేసీఆర్ గతంలో వైఎస్‌ను తిట్టారు కాబట్టి, వైసీపీ అభిమానులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అప్పట్లో ఇది తీవ్ర దుమారం రేపింది. దీంతో శివకుమార్‌ను వైసీపీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. అయితే, ఆ తర్వాత శివకుమార్ రాజీ పడ్డారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత, ఏపీలో ఎన్నికలకు ముందు 2019 మార్చిలో శివకుమార్ వెళ్లి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత మళ్లీ వైసీపీలోకి తీసుకున్నారు. తెలంగాణ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఇప్పుడు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం కల్పించారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...