వైసీపీ వినాశనానికి పునాది... బీజేపీ తనకు చెప్పిన సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్

మూడు రాజధానులతో వైసీపీ వినాశనానికి పునాది పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో జనసేన పార్టీ ఆఫీసు వద్దకు వచ్చిన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

news18-telugu
Updated: January 20, 2020, 10:53 PM IST
వైసీపీ వినాశనానికి పునాది... బీజేపీ తనకు చెప్పిన సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్
  • Share this:
మూడు రాజధానులతో వైసీపీ వినాశనానికి పునాది పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో కొందరికి గాయాలు అయ్యాయి. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కళ్యాన్, జనసేన నేతలను పోలీసులు నిలువరించారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి వారిని బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో జనసేన పార్టీ ఆఫీసు వద్దకు వచ్చిన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ‘ఇవాళ జగన్ మూడు రాజధానులు అంటున్నారు. రేపు మరొకరొచ్చి ఏడు రాజధానులు అంటే అయిపోతుందా? ఎప్పటికైనా అమరావతే రాజధాని. ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇక్కడకు తిరిగిరావడం ఖాయం. బీజేపీ నేతలు నాకు ఒక్క మాట మాత్రం హామీ ఇచ్చారు. అమరావతే రాజధాని అని వారు చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఉంటాం. ఏ విధంగా ముందుకెళ్లాలనేది బీజేపీతో చర్చించి ముందుకెళతాం.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

తాను ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు ఒక్కటే మాట చెప్పారని, ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని గత పాలకులు తప్పు చేస్తే వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాలే గానీ కొత్తగా మళ్లీ తప్పులు చేయకూడదన్నారు. ప్రస్తుతం రాజధాని తరలింపు తాత్కాలికమేనని, శాశ్వత రాజధాని అమరావతే అవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మహిళలని, రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తిట్టిన ప్రతి ఒక్కరికీ శాపం తగులుతుందని, వారు దానికి తగినట్టు ఏడ్చి తీరుతారని శాపం పెట్టారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు