బీజేపీతో వార్... జగన్ అప్పుడే డిసైడయ్యారా ?

ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉండే అతికొద్ది మంది ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. అలాంటి కోటంరెడ్డి... 2024లో తమ పోటీ బీజేపీతోనే అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: December 12, 2019, 3:33 PM IST
బీజేపీతో వార్... జగన్ అప్పుడే డిసైడయ్యారా ?
జగన్, మోదీ
  • Share this:
రాబోయే ఎన్నికల్లో ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడే ఊహించడం కష్టం. అయితే దీనిపై రాజకీయ పార్టీలు కాస్త ముందస్తు అవగాహనతోనే ముందుకు సాగుతుంటాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ... ఈ విషయంలో అప్పుడే ఓ క్లారిటీకి వచ్చినట్టు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది జగన్‌ పుణ్యమే అని వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి...షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 2024లో వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని... టీడీపీకి 3వ స్థానమే అని కామెంట్ చేశారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేకపోయినా... తన వ్యాఖ్యల ద్వారా ఓ విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారనే టాక్ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉండే అతికొద్ది మంది ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. అలాంటి కోటంరెడ్డి... 2024లో తమ పోటీ బీజేపీతోనే అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయంగా బలపడేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తులను సీఎం జగన్ ముందుగానే గమనించారా ? ఈ విషయంపై తమ పార్టీ నేతలకు ముందుగానే క్లారిటీ ఇచ్చారా ? అనే టాక్ నడుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి టీడీపీ స్థానంలో బీజేపీ బలపడుతుందనే బలమైన సంకేతాలు ఉండటం వల్లే... సీఎం జగన్ తమ ప్రత్యర్థిగా బీజేపీని భావిస్తున్నారేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>