ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress Party), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party)ల మధ్య మరోవార్ మొదలైంది. అసెంబ్లీలో తన సతీమణి భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Nara Chandra Babu Naidu) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. శనివారం ఎన్టీఆర్ కుటుంబం మీడియా సాక్షిగా వైసీపీకి వార్నింగ్ ఇవ్వడం కాకరేపింది. ఐతే దీనిపై వైసీపీ సోషల్ మీడియా ద్వారా కౌంటర్లు ఇస్తోంది. ఆ పార్టీ నేతలు కూడా ఎన్టీఆర్ కుటుంబానికి కౌంటర్ ఇస్తున్నారు. బాలకృష్ణ కామెంట్స్ ను కోట్ చేస్తే గతంలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తున్నారు. ఇటు వైసీపీ.. అటు టీడీపీ మధ్య సోషల్ మీడియా ద్వారా ట్విట్లు, కౌంటర్ల తూటాలు పేలుతున్నాయి.
వైసీపీపై ఎన్టీఆర్ కుటుంబం విమర్శలకు బదులుగా వైసీపీ ఎన్టీఆర్ చనిపోకముందు జరిగిన ఘటనలు, అప్పుడు ఎన్టీఆర్ కుటుంబం వ్యవహరించిన తీరుపై ట్విట్టర్ సాక్షిగా విమర్శలు సంధించింది. “కన్న తండ్రి ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు వేయించిన రోజు బయటకు రాలేదు. నేడు బాబును రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించడంతో.. రాజకీయ ఉనికి కోసం "ఫ్యామిలీ సింపతీ" డ్రామా పండించే యత్నం. భువనేశ్వరి గారిని ఏఒక్కరూ ఒక్క మాట అనకపోయినా రాజకీయ లబ్దికోసం ఆమె గౌరవాన్ని మీడియాకీడ్చారు.” అని వైసీపీ ట్వీట్ చేసింది.
కన్న తండ్రి ఎన్టీఆర్ పై చంద్రబాబు చెప్పులు వేయించిన రోజు బయటకు రాలేదు. నేడు బాబును రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించడంతో.. రాజకీయ ఉనికి కోసం "ఫ్యామిలీ సింపతీ" డ్రామా పండించే యత్నం. భువనేశ్వరి గారిని ఏఒక్కరూ ఒక్క మాట అనకపోయినా రాజకీయ లబ్దికోసం ఆమె గౌరవాన్ని మీడియాకీడ్చారు. pic.twitter.com/gRB7AFvZBW
— YSR Congress Party (@YSRCParty) November 20, 2021
చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్వీట్ ద్వారా విమర్శలు సంధించారు విజయసాయి రెడ్డి. “రాజకీయ నాయకులకు ఆస్కార్ అవార్డు ఉంటే అయన హ్యాట్రిక్స్ పై హ్యాట్రిక్స్ కొట్టేవాడు. ఎన్టీఆర్ సినిమాల్లో మాత్రమే నటించేవారు - చంద్రంబాబుకు మాత్రం...నిజ జీవితం, రాజకీయాల్లో కూడా.....నటనే. అది అమోఘం, అనితర సాధ్యం.” అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు..
రాజకీయ నాయకులకు ఆస్కార్ అవార్డు ఉంటే అయన హ్యాట్రిక్స్ పై హ్యాట్రిక్స్ కొట్టేవాడు. ఎన్టీఆర్ సినిమాల్లో మాత్రమే నటించేవారు - చంద్రంబాబుకు మాత్రం...నిజ జీవితం, రాజకీయాల్లో కూడా.....నటనే. అది అమోఘం, అనితర సాధ్యం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 20, 2021
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కుటుంబం చేసిన ఆరోపణలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏమీ జరగనిదానికి ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారాయన. ఎన్టీ రామారావుపై ఆయన కన్నబిడ్డల్లోనే విషాన్ని ఎక్కించిన ఘనత చంద్రబాబుది అని పేర్ని నాని ఆరోపించారు
ఎన్టీఆర్ గురించి గర్వంగా చెప్పుకునే ఆయన పిల్లల్ని కూడా కన్నతండ్రిపై ఎగదోశారన్నారు. అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదో అన్నట్లు క్రియేట్ చేసి నందమూరి కుటుంబంతో ప్రెస్ మీట్ పెట్టించారని ఆరోపించారు. వ్యవసాయంపై చర్చ జరుగుతున్నప్పుడు సభలో సీఎం జగన్ లేకపోయినా చంద్రబాబు పనిగట్టుకొని అసత్యాలు మాట్లాడారన్నారు. అసెంబ్లీలో సీఎం బాబాయి గురించి, హత్య గురించి, తల్లి గురించి, చెల్లి గురించి మాట్లాడదామా అంటూ చంద్రబాబు రెచ్చగొట్టారని పేర్ని నాని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bala Krishna Nandamuri, Chandrababu Naidu, TDP, Vijayasai reddy, Ysrcp