ఉండవల్లిలో కరకట్ట మీద చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర పన్నిందని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ‘చంద్రబాబుగారి ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూరాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు?’ అంటూ నారా లోకేష్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద ఓ పడవ కనిపిస్తోంది.
నారా లోకేష్ ట్వీట్
చంద్రబాబుగారి ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూరాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు? pic.twitter.com/5GAe8nmk4K
చంద్రబాబు నాయుడి ఇంటిలోకి వరద నీరు ప్రవేశించిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే, అది ఔట్ హౌస్కు సంబంధించిన ఫొటో అని, అసలు ఇల్లు వేరని లోకేష్ చెప్పారు. మరోవైపు చంద్రబాబునాయుడి నివాసంపై డ్రోన్ వినియోగించడం పెద్ద దుమారానికి దారి తీసింది. హైసెక్యూరిటీ జోన్లో డ్రోన్ ఎలా వినియోగిస్తారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. అయితే, వరద పరిస్థితిని అంచనా వేయడానికి గత మూడు రోజులుగా డ్రోన్లు వినియోగిస్తున్నామని, చంద్రబాబునాయుడు డ్రామాలుమానుకోవాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.