జగన్ భద్రతకు ముప్పు... లోకేష్‌పై వైసీపీ ఫిర్యాదు

నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కుట్రపూరితంగా ఈ వీడియోను చిత్రీకరించారని అనుమానం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: November 29, 2019, 2:32 PM IST
జగన్ భద్రతకు ముప్పు... లోకేష్‌పై వైసీపీ ఫిర్యాదు
నారా లోకేష్, వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖుల భద్రతకు ముప్పు వాటిల్లే ఘటన జరిగిందని.. దీనికి నారా లోకేష్ కారకుడంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 28న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు అమరావతిలో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించిన దృశ్యాలను డ్రోన్ కెమెరాలో చిత్రీకరించారు. అయితే, అత్యంత భద్రత ప్రమాణాలు అమల్లో ఉన్న సచివాలయం, అసెంబ్లీ, సీఎం కార్యాలయం మీదుగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఇది చట్టరీత్యా నేరమని, దీనిపై కేసు నమోదు చేయాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు డీఎస్పీకి లేఖ రాశారు. తమకు తెలిసినంతవరకు నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కుట్రపూరితంగా ఈ వీడియోను చిత్రీకరించారని అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక దాగి ఉన్న కుట్రను ఛేదించి బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
First published: November 29, 2019, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading