అందులో నిజం లేదు... జగన్ ఢిల్లీ టూర్‌పై వైసీపీ వివరణ

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్‌పై వస్తున్న వదంతులపై వైసీపీ వివరణ ఇచ్చింది.

news18-telugu
Updated: October 22, 2019, 5:23 PM IST
అందులో నిజం లేదు... జగన్ ఢిల్లీ టూర్‌పై వైసీపీ వివరణ
సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: October 22, 2019, 5:23 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై వస్తున్న వదంతులపై వైసీపీ వివరణ ఇచ్చింది. కేంద్ర హోంమంత్రితో సమావేశం తరువాత పలువురు ఇతర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కావాల్సి ఉన్నా... కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ భేటీలు రద్దయ్యాయి. దీనిపై మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఈ అంశంపై వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపీ సమస్యలపై తాను ఇతర శాఖల మంత్రులతో మాట్లాడతానని అమిత్‌షా అనడంతోనే మంత్రులతో సీఎం జగన్ భేటీలు వాయిదాపడ్డాయని తెలిపింది. రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై చర్చ జరిగిందని ప్రకటనలో వెల్లడించింది.

అత్యంత సుహృద్భావ వాతావరణంలో అమిత్‌షాతో సీఎం జగన్‌ సమావేశం జరిగిందని వైసీపీ పేర్కొంది. తన పుట్టినరోజు వేళ సమయం లేకున్నా వైయస్‌ జగన్‌తో అమిత్ షా 45 నిమిషాలు మాట్లాడారని తెలిపింది. వ్యతిరేక ప్రచారం మాటన పబ్బంగడుపుకోవాలన్నది టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతున్నాయని ఆరోపించింది. అంతకుముందు సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దక్కకపోవడంపై రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ రోజు అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం జరిగినా... ఇతర మంత్రులతో ఆయన భేటీ రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది.


First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...