ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫలితాల తర్వాత తొలిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్, మరికొందరు పార్టీ ముఖ్యనేతలు హైదరాబాద్ బేగంపేట చేరుకున్నారు. బేగంపేట నుంచి రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. హైదరాబాద్‌లో జగన్ మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్‌లో వైసీపీ అభిమానులు జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్ వరకు వైసీపీ కేడర్ క్యూ కట్టారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి వెళ్తున్న దారి పొడవునా... ‘జగన్... జగన్’ నినాదాలు హోరెత్తాయి. యువత ‘సీఎం జగన్’ అంటూ కేకలు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ‘ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం.. మేం గర్వపడేలా చేశావ్.’ అని ఫ్లెక్సీలు కట్టారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.