టార్గెట్ 2024... రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన... వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన చేస్తానని... ఇందుకు అందరి సహకారం ఉండాలని జగన్ అన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పరిపాలన చేస్తానని ఆయన తెలిపారు.

news18-telugu
Updated: May 25, 2019, 12:17 PM IST
టార్గెట్ 2024... రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన... వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీకి ఓట్లు వేశారని... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరిపాలన కొనసాగిద్దామని వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ జగన్... 2024 ఎన్నికల్లో గెలవడమే టార్గెట్‌గా పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన చేస్తానని... ఇందుకు అందరి సహకారం ఉండాలని జగన్ అన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పరిపాలన చేస్తానని ఆయన తెలిపారు.

కేవలం ఒక్కశాతం ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమయ్యామన్న జగన్... ఈ సారి టీడీపీతో పోల్చితే పదిశాతం అత్యధికంగా ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చామని అన్నారు. ఇదే సమావేశంలో టీడీపీ, చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను చంద్రబాబు డబ్బు ఎరచూపి లాక్కున్నారని ఆరోపించిన జగన్... ఇప్పుడు టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మిగిలారని వ్యాఖ్యానించారు.

Video:-టార్గెట్ 2024... రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన... వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
First published: May 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading