ప్రధాని మోదీ సమావేశానికి వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి భేటీకి తేదీ ఖరారైంది. ఈ మేరకు ఆయన ఈ నెల 26న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 30న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమానికి మోదీని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. అందుకే మోదీని ఆయన కలవనున్నారని సమాచారం. అటు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 30నే చేయనున్నారని తెలుస్తోంది. రేపు ఎన్డీయే సమావేశానంతరం మోదీ తన ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి 151 సీట్లను సాధించిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30న జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. తన ప్రమాణస్వీకారం గురించి జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ లో వివరించారు. విజయవాడలో జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాల్సిందిగా జగన్ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఎన్నికల ఫలితాల తీరుతెన్నులపైనా ఇరువురు ఫోన్ లో చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 25న తాడేపల్లిలో వైసీపీఎల్పీ సమావేశం ముగిశాక జగన్ హైదరాబాద్ వెళతారు. ఆపై కేసీఆర్ ను నేరుగా కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కోరనున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.