తండ్రి రాజశేఖర్‌రెడ్డిని తలుచుకున్న జగన్.. ప్రజలకు అభివాదం చేస్తూ..

ఉదయమే ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ను వద్దకు వెళ్లి ఆయన్ను స్మరించుకున్నారు. ఘనంగా నివాళులు అర్పించారు.

news18-telugu
Updated: May 17, 2019, 11:12 AM IST
తండ్రి రాజశేఖర్‌రెడ్డిని తలుచుకున్న జగన్.. ప్రజలకు అభివాదం చేస్తూ..
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి
news18-telugu
Updated: May 17, 2019, 11:12 AM IST
ఇంకా ఆరు రోజులే ఉంది.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆస్తకిగా ఎదురు చూస్తున్న ఏపీ అధికార పీఠం ఎవరిదో తేలిపోవడానికి. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీదే అధికారం అని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. జగనే సీఎం అవుతాడని చెబుతున్నాయి. లోక్‌సభ సీట్లను కూడా ఆయన పార్టీయే ఎక్కువ గెలుచుకుంటుందని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో.. జాతీయ పార్టీలు కూడా జగన్ స్నేహహస్తం కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ, ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాలని జగన్ భావిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లి అక్కడ ప్రజలతో మమేకమయ్యారు. అక్కడి దర్గాను సందర్శించారు. రమణ దీక్షితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు జగన్ ఏం చేసినా సంచలనమే అవుతోంది. ఆయన ప్రతి అడుగును దేశం ఆస్తకిగా తిలకిస్తోంది.

కాగా, ఈ రోజు హైదరాబాద్‌కు బయలుదేరాల్సి ఉండగా.. ఉదయమే ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ను వద్దకు వెళ్లి ఆయన్ను స్మరించుకున్నారు. ఘనంగా నివాళులు అర్పించారు. జగన్‌తో పాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, పలువురు పార్టీ నేతలు కూడా వైఎస్ఆర్‌కు అంజలి ఘటించారు. అక్కడికి వచ్చిన ప్రజలకు, వైఎస్ అభిమానులకు అభివాదం చేస్తూ జగన్‌ హైదరాబాద్‌ బయల్దేరారు.

కాగా నిన్నరాత్రి వైఎస్‌ జగన్‌ కడప అమీన్‌పూర్‌ దర్గాను సందర్శించారు. దర్గా నిర్వహకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ఆర్‌సీపీ చీఫ్ చాదర్‌ సమర్పించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనితో కలిసి ఇఫ్తార్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో దర్గా ప్రాంగణమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...