చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం..

చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహించాలనే ఈసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు.

news18-telugu
Updated: May 17, 2019, 9:37 PM IST
చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం..
చంద్రబాబు, జగన్ (File)
  • Share this:
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస ప్రశ్నలు సంధించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహించాలనే ఈసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. సీఈసీ సునీల్ అరోరాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. వైసీపీ ఫిర్యాదు చేసిన పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారని, టీడీపీ ఫిర్యాదు చేసిన పోలింగ్ బూత్‌ల మీద కనీసం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై జగన్ స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో చంద్రబాబు మీద ప్రశ్నల వర్షం కురిపించారు.

‘చంద్రబాబు నాయుడు గారూ రీ పోలింగ్ అప్రజాస్వామికమా?, లేక రిగ్గింగా? చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయనివ్వకుండా వారి ఓట్లు మీరు వేయడం అప్రజాస్వామికమా? లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డుపడటమా? రీ పోలింగ్ అంటే మీకుందుకు జంకు? అయిదు పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 19న చంద్రగిరి నియోజకవర్గంలోని కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318, బూత్ నెంబర్ 321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో రీ పోలింగ్ జరగనుంది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>