టార్గెట్ చంద్రబాబు... వైసీపీ గెలిస్తే స్పీకర్ ఆయనేనా...

చంద్రబాబు తోడల్లుడు, పర్చూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్‌గా ఎంపిక చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

news18-telugu
Updated: May 14, 2019, 2:48 PM IST
టార్గెట్ చంద్రబాబు... వైసీపీ గెలిస్తే స్పీకర్ ఆయనేనా...
చంద్రబాబు, వైఎస్ జగన్ (File)
  • Share this:
తమ ప్రత్యర్థులను మానసికంగా దెబ్బకొట్టడం కూడా రాజకీయ వ్యూహంలో ఓ భాగమే. రాజకీయ నేతలు ఎప్పటికప్పుడు తమ ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు మైండ్ గేమ్‌లో భాగంగా ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తుంటారు. ఏపీలో ఈ సారి అధికారం ఖాయమని భావిస్తున్న వైసీపీ... తాము అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిని రాజకీయంగా దెబ్బకొట్టడంతో పాటు ఆయనతో మైండ్ గేమ్ ఆడేందుకు కూడా సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు తోడల్లుడు, పర్చూరు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్‌గా ఎంపిక చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

రాజకీయంగా చంద్రబాబుకు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మధ్య పూడ్చలేనంత అగాధం ఉంది. అయితే రాజకీయాల్లో చంద్రబాబు దగ్గుబాటికి ఏ మాత్రం అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. చంద్రబాబుపై పొలిటికల్‌గా రివెంజ్ తీర్చుకోవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దగ్గుబాటి... ఇందుకోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పీకర్ స్థానంలో కూర్చుంటే చంద్రబాబు ఆయనను అధ్యక్షా... అధ్యక్షా అని సంభోదించాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే విషయమే అని వైసీపీ భావిస్తోంది.

ఇక అసెంబ్లీకి సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ స్పీకర్‌దే తుది నిర్ణయం కావడంతో... దగ్గుబాటి స్పీకర్‌గా ఎంపికైతే టీడీపీకి ఎంతోకొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఇంతలా టీడీపీ, చంద్రబాబు ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో... స్పీకర్‌గా దగ్గుబాటి వైపే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయంగా సీనియర్ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సముచిత స్థానం కల్పించాలంటే ఆయనకు మంత్రి పదవి కల్పించాల్సి ఉంటుంది. అయితే ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటానని ఇప్పటికే జగన్ ప్రకటించారు. దీంతో అదే జిల్లాకు చెందిన దగ్గుబాటిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండదని... అందుకే ఆయనకు స్పీకర్‌గా అవకాశం కల్పించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.




First published: May 14, 2019, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading