వైసీపీలోని ఆ నేతకు ఎంపీ సీటు... మోహన్‌బాబుకు టీటీడీ చైర్మన్‌ ఖాయమైనట్టేనా ?

వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయించుకోవడంతో... టీటీడీ చైర్మన్ పోస్టు ఎవరికి దక్కుతుందనే అంశంపై సస్పెన్స్ తొలగిపోయినట్టే అనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: June 4, 2019, 3:17 PM IST
వైసీపీలోని ఆ నేతకు ఎంపీ సీటు... మోహన్‌బాబుకు టీటీడీ చైర్మన్‌ ఖాయమైనట్టేనా ?
మోహన్ బాబు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 4, 2019, 3:17 PM IST
పార్టీ కోసం పని చేసిన నేతలకు పదవులు ఇచ్చే విషయంపై వైసీపీ అధినేత, ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం పని చేసి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కోసం తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకున్న వైవీ సుబ్బారెడ్డికి ఏ పదవి ఇవ్వాలనే దానిపై జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చాలాకాలం నుంచి రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు కూడా వినిపించాయి. దీంతో జగన్ వైవీ సుబ్బారెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. తాజాగా సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించుకోవడంతో... టీటీడీ చైర్మన్ పోస్టు ఎవరికి దక్కుతుందనే అంశంపై సస్పెన్స్ తొలగిపోయినట్టే అనే ప్రచారం జరుగుతోంది. సినీనటుడు మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ పోస్టు ఇవ్వబోతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఆయనకు రాజ్యసభ సీటు లేదా టీటీడీ చైర్మన్ పోస్టు ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది. వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ ఇస్తే మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ పోస్టు ఇస్తారని... సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పోస్టు ఇస్తే మోహన్ బాబుకు రాజ్యసభ సీటు ఇస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని జగన్ నిర్ణయించడంతో... ఇక టీటీడీ చైర్మన్ విషయంలో మోహన్‌బాబుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టే అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.First published: June 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...