జగన్‌కు ఊహించని స్పందన.. సీఎం అవడం ఖాయమన్న కారణంతోనేనా..

YSRCP: క్యాంపు కార్యాలయం ప్రజలతో కిక్కిరిసిపోయింది. స్థానిక పార్టీ నేతలే కాకుండా ఇతర ప్రాంతాల నాయకులు కూడా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

news18-telugu
Updated: May 16, 2019, 8:55 AM IST
జగన్‌కు ఊహించని స్పందన.. సీఎం అవడం ఖాయమన్న కారణంతోనేనా..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
మరో వారంలో ఎన్నికల ఫలితాలు.. దేశ రాజకీయంపై చర్చ ఎలా ఉన్నా, ఏపీ రాజకీయం అంటే మాత్రం ఉత్కంఠ రేపుతోంది. రిజల్ట్స్‌పై ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలోని లోక్‌సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహిస్తుండగా, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అంతకుముందే తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్న జగన్.. మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే ఉంటున్నారు. అయితే, ప్రజాదర్బార్‌లో జగన్‌కు ఊహించని స్పందన లభించింది. క్యాంపు కార్యాలయం ప్రజలతో కిక్కిరిసిపోయింది. స్థానిక పార్టీ నేతలే కాకుండా ఇతర ప్రాంతాల నాయకులు కూడా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

ఈ సందర్భంగా తనవద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరితో జగన్ పలకరించారు. కొందరితో సెల్ఫీ కూడా తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రానుందని, అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా, సామూహిక సమస్యలను ప్రజలు ఆయనకు తెలుపుకున్నారు. వారందరి సమస్యలను ఆయన ఓపికతో విన్నారు.

ఇక, ఈరోజు కూడా ప్రజాదర్బార్‌ నిర్వహించి సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరతారు. అయితే ఫలితాలకు ముందు జగన్ పులివెందుల పర్యటన వెనుక అసలు కారణం వేరే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఏ రకంగా ఉందనే దానిపై తన పులివెందుల పర్యటనలో జగన్ సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. పులివెందులలో తనకు రాబోయే మెజార్టీతో పాటు రాయలసీమ జిల్లాల్లో వైసీపీ విజయావకాశాలపై జగన్ సమీక్షించినట్లు సమాచారం. రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై వైసీపీ భారీ ఆశలు పెట్టుకుంది. కోస్తా జిల్లాలతో పోలిస్తే తమకు ఎక్కువగా పట్టున్న ఈ ఆరు జిల్లాల్లో అత్యధిక సీట్లు వస్తాయని వైసీపీ భావిస్తోంది.
First published: May 16, 2019, 8:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading