నేనే సీఎం అంటున్న జగన్.. ఆసక్తి పెంచిన వైసీపీ చీఫ్ ఫేస్‌బుక్ పోస్ట్..

AP Elections 2019: ఏపీలో అధికారం చేపట్టబోయేది వైసీపీ పార్టీయేనని, సీఎం అయ్యేది తానేనని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.

news18-telugu
Updated: May 22, 2019, 8:52 AM IST
నేనే సీఎం అంటున్న జగన్.. ఆసక్తి పెంచిన వైసీపీ చీఫ్ ఫేస్‌బుక్ పోస్ట్..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు.. ఎవరి గెలుపుపై వారి అంచనాలు.. ఎగ్జిట్ పోల్స్ కూడా ఓ అంచనాకు వచ్చి ఫలితాలు వెలువరించాయి. కేంద్రంలో ఎన్డీయేదే అధికారం అని చెప్పగా, ఏపీలో వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని వెల్లడించాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్‌పై జగన్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, మంగళవారం మధ్యాహ్నం ఆయన చేసిన ఒక పోస్టు తెలుగు ప్రజల్లో ఆసక్తిని పెంచాయి. ఏపీలో అధికారం చేపట్టబోయేది వైసీపీ పార్టీయేనని, సీఎం అయ్యేది తానేనని చెప్పకనే చెప్పేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాపరిపాలనే సాగాలి అనే పేరుతో.. ‘మండుటెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారు. వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటాను’ అని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో తానే సీఎం కాబోతున్నానని పరోక్షంగా వెల్లడించారు. అదీకాక, రాజన్న సుపరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం అంటూ పోస్ట్ చేశారు.

facebook, facebook post, ys jagan, jagan facebook post, jagan, ysrcp, cbn, chandra babu naidu, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, సర్వే ఫలితాలు, లగడపాటి,lagadapati exit polls, lagadapati rajagopal, exit polls bettings, exit polls, exit polls 2019, counting day, ap assembly elections, ap assembly elections 2019, lok sabha elections 2019, chandra babu, tdp, ycp, లగడపాటి రాజగోపాల్, లగడపాటి ఎగ్జిల్ పోల్స్, ఎన్నికల సంఘం, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, ఏపీలో టీడీపీ, బెట్టింగ్, పందేలు, పందెం,
ఫేస్‌బుక్‌లో వైఎస్ జగన్ చేసిన పోస్ట్


ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక జగన్‌లో ధీమా పెరిగింది అని చెప్పడానికి నిదర్శనం ఇదే. వైఎస్ జగన్ పోస్ట్‌కు పలువురు కార్యకర్తలు, వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్ష పార్టీల నేతలను కలుస్తూ హంగ్ వస్తే ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తు్న్న సంగతి తెలిసిందే.

Published by: Shravan Kumar Bommakanti
First published: May 22, 2019, 8:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading