సీఎం సీటు ఇంకెంత దూరం... వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం...

Ap assembly election results 2019 | గడిచిన ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లిన జగన్… ఏడాది క్రితం ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. మూడున్నర వేల కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించిన జగన్… ప్రస్తుతం తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే తన తండ్రి వైఎస్సార్ పాలనను మరిపిస్తానని హామీ ఇస్తున్నారు.

news18-telugu
Updated: May 23, 2019, 6:20 AM IST
సీఎం సీటు ఇంకెంత దూరం... వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
2009 ఎన్నికల్లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా తొలిసారి కడప లోక్ సభ స్ధానం నుంచి ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. అప్పటి నుంచి వరుసగా విజయాలు సాధిస్తూనే ఉన్నారు. సొంత గడ్డపై వరుస విజయాలు సాధిస్తున్న జగన్.. ఏపీలో చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి ఈసారి ఎన్నికలు పరీక్షగా నిలువనున్నాయి. 2019లో పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జగన్ గెలుపుపై ఎవరికీ అనుమానాలు లేకపోయినా… ఈసారి ఏపీలో వైసీపీని విజయ తీరాలకు చేర్చడంపైనే ఆయనతో పాటు పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడనుంది.

#YourLeader: సీఎం సీటు ఇంకెంత దూరం...వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం...
ఎన్నికల నగారా మోగిస్తున్న జగన్(File)


2009 కంటే ముందు బెంగళూరు కేంద్రంగా అనేక వ్యాపారాలు చేసిన వైఎస్ జగన్.. తన తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో తొలిసారి రాజకీయాలపై ఆసక్తి చూపారు. కుమారుడు జగన్ ను కడప నుంచి ఎంపీగా బరిలోకి దించే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించిన వైఎస్సార్… తొలి పోటీ లోనే జగన్ ను విజేతగా నిలిపారు. వైఎస్సార్ రెండోసారి అధికారం చేపట్టాక 2009లో హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడంతో ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన అభిమానుల పరామర్శ కోసం జగన్ ఓదార్పుయాత్ర చేపట్టారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకోవడంతో చేసేది లేక పార్టీకి జగన్, ఆయన తల్లి విజయమ్మ రాజీనామా చేశారు.

#YourLeader: సీఎం సీటు ఇంకెంత దూరం...వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం...
పులివెందులలో వైఎస్ జగన్


2011 మార్చిలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించిన జగన్ … ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయాలతో అప్పటి ప్రాంతీయ, జాతీయ పార్టీలకు సవాల్ విసిరారు. 2014 ఎన్నికల్లో నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని ఢీకొన్న జగన్.. అధికార పీఠం చేరుకోలేకపోయినా 67 సీట్లను వైసీపీకి సాధించిపెట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లిన జగన్… ఏడాది క్రితం ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. మూడున్నర వేల కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించిన జగన్… ప్రస్తుతం తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే తన తండ్రి వైఎస్సార్ పాలనను మరిపిస్తానని హామీ ఇస్తున్నారు.

#YourLeader: సీఎం సీటు ఇంకెంత దూరం...వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం...
పాదయాత్రలో జగన్


2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీని స్ధాపించిన జగన్ ను అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యంగా చేసుకుంది. షెల్ కంపెనీల స్ధాపనతో పాటు అక్రమ మార్గాల్లో తన సొంత మీడియా సంస్ధ సాక్షిలో పెట్టుబడులు తెచ్చుకున్నారన్న ఆరోపణలపై ఆయన 16 నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై ఇప్పటికీ జగన్ కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. జగన్ అక్రమాస్తుల కేసుతో ప్రమేయం ఉన్న పలువురు అధికారులపై అభియోగాలు నమోదైన వారిలో అత్యధిక శాతం హైకోర్టులో పోరాడి క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. జగన్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు మాజీ మంత్రులు, నేతలు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. జగన్ తో పాటు వీరిని టీడీపీ లక్ష్యంగా చేసుకుంటోంది.
#YourLeader: సీఎం సీటు ఇంకెంత దూరం...వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం...
జనంతో జగన్


వైఎస్ జగన్మోహన్ రెడ్డి కెరీర్ లో మైలురాళ్లు

2009లో రాజకీయ రంగ ప్రవేశం
2009లో కడప ఎంపీగా విజయం
2010 కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికీ రాజీనామా
2011 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపన
2011 వైసీపీ తరఫున కడప ఎంపీ ఉపఎన్నికల్లో 5 లక్షల పైచిలుకు మెజారిటీతో విజయం
2011 అక్రమాస్తుల కేసులో జైలుకు
2012 అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు
2014 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా విజయం
2018 ఏపీలో ప్రజాసంకల్పయాత్ర
2019 మరోసారి పులివెందుల నుంచి పోటీ
First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading