జగన్ ప్రమాణస్వీకార ముహూర్తం మారిందా... కారణం ఇదేనా...

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వారం తరువాత అంటే మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నాడని సమాచారం.

news18-telugu
Updated: May 21, 2019, 4:46 PM IST
జగన్ ప్రమాణస్వీకార ముహూర్తం మారిందా... కారణం ఇదేనా...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం తమదే అనే ధీమాలో ఉంది విపక్ష వైసీపీ. లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినప్పటికీ... వైసీపీ వర్గాలు మాత్రం గెలుపు కచ్చితంగా తమదే అని నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. తాము అధకారంలోకి వస్తే... ఈ నెల 26 తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయడానికి నిర్ణయించుకున్నాడనే వార్తలు వినిపించాయి.అయితే తాజాగా తన ప్రమాణస్వీకారోత్సవం ముహూర్తంపై జగన్ మనసు మారిందని తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వారం తరువాత అంటే మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నాడని సమాచారం. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచనల మేరకే జగన్ తన ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా ఇలాంటి అంశాల్లో ఎక్కువగా స్వరూపానంద సూచనలు పాటిస్తున్న వైసీపీ అధినేత... ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తం విషయంలోనూ ఆయన సలహానే పాటించారని... అందుకే ముందుగా అనుకున్న ముహూర్తాన్ని కాదని కొద్ది రోజులు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అదే రోజు జగన్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని మెజార్టీ మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫలితాలు వచ్చిన తరువాత వారం రోజుల పాటు జాతీయ రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై వైసీపీ అధినేత దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>