వైసీపీ నుంచి ఆయన సస్పెండ్.. ఇతర నేతలకు సీరియస్ వార్నింగ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును, పార్టీలోని పార్లమెంట్‌ సభ్యులు, సీనియర్ నాయకుల పేర్లను ఉపయోగించి ఎవరైనా భూదందాలు, సెటిల్‌మెంట్స్ చేసినా ఇదే స్థాయిలో క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: August 12, 2020, 2:36 PM IST
వైసీపీ నుంచి ఆయన సస్పెండ్.. ఇతర నేతలకు సీరియస్ వార్నింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నాయకుడిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. విశాఖపట్టణానికి చెందిన వైసీపీ నేత కొయ్యా ప్రసాద్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్రం కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. విశాఖపట్టణంలో కొయ్యా ప్రసాద్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలున్నాయి. విశాఖ కలెక్టరేట్ పేరును, రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి పేరును ఉపయోగించి ల్యాండ్ సెటిల్మెంట్స్ పేరుతో అక్రమ కార్యకలాపాలను నిర్వహించారని పార్టీ దృష్టికి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిణగించిన పార్టీ క్రమశిక్షణ సంఘం.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో పార్టీలో ఉన్న ఇతర నేతలకు స్పష్టమైన హెచ్చరిక పంపింది వైసీపీ కేంద్రం కార్యాలయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును, పార్టీలోని పార్లమెంట్‌ సభ్యులు, సీనియర్ నాయకుల పేర్లను ఉపయోగించి ఎవరైనా భూదందాలు, సెటిల్‌మెంట్స్ చేసినా ఇదే స్థాయిలో క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. పార్టీ క్రమశిక్షణా నియమావళికి లోబడే పనిచేయాలని.. వైసీపీకి చెడ్డ పేరు వచ్చేలా చేస్తే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తామని ప్రకటనలో పేర్కొంది.
Published by: Shiva Kumar Addula
First published: August 12, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading