వచ్చేసింది రాజన్న రాజ్యం... సంబరాల్లో వైసీపీ శ్రేణులు

పార్టీ శ్రేణులంతా స్వీట్స్ తినిపించుకుంటున్నారు. డప్పులు, న‌ృత్యాలతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అటు తాడేపల్లితో పాటు... ఇటు కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ వద్ద కూడా పండగ వాతావరణం నెలకొంది.

news18-telugu
Updated: May 23, 2019, 12:28 PM IST
వచ్చేసింది రాజన్న రాజ్యం... సంబరాల్లో వైసీపీ శ్రేణులు
వైసీపీ నేతల సంబరాలు
  • Share this:
ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. పలుజిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఎక్కడికక్కడ పార్టీ నాయకులంతా సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చుుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీంతో పార్టీ శ్రేణులంతా స్వీట్స్ తినిపించుకుంటున్నారు. డప్పులు, న‌ృత్యాలతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అటు తాడేపల్లితో పాటు... ఇటు కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ వద్ద కూడా పండగ వాతావరణం నెలకొంది. తాడేపల్లిలో జగన్ నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు చేరుకుంటున్నారు.

మరోవైపు ఏపీలో ప్రముఖ నాయకులంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు ఓటమి దిశగా సాగుతున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేష్, నారాయణ, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, ఆదినారాయణ, శిద్ధా రాఘవరావు, అఖిలప్రియ, చినరాజప్ప, గంటా శ్రీనివాస్, సుజయకృష్ణ రంగారావు, కళావెంకట్రావు వెనుకంజలో ఉన్నారు. మంత్రుల్లో దేవినేని ఉమ, జవహర్, ప్రత్తిపాటి, అమర్నాథ్ రెడ్డి మాత్రమే ముందంజలో ఉన్నారు.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు